సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు రిలీజ్ డేట్ ని మార్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మరో కొత్త రిలీజ్ డేట్ తో ప్రత్యేక్షమైపోయింది. ఇటీవల రెండు రిలీజ్ డేట్లతో ముందుకొచ్చి అది లేక ఇది అని చెప్పిన మేకర్స్.. ఇప్పుడు ఆ రెండు కాకుండా కొత్త రిలీజ్ డేట్ ని తెలిపారు. అంతకు ముందు మార్చి18, ఏప్రిల్ 28 తేదీలను ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు మార్చి 25 వ తేదీని కన్ఫర్మ్ చేసినట్లు తెలిపారు.
మార్చి 25 న ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. అప్పటికి కరోనా కొద్దిగా నెమ్మదించి థియేటర్స్ అన్ని తెరుచుకుంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా మార్చిలో పెద్ద సినిమా హడావిడి కూడా బాగానే కనిపిస్తుంది. మరి ఆర్ఆర్ఆర్ దెబ్బకు ఈ సినిమాలు వాయిదా పడతాయో.. లేక దాంతో పోటీ పడతాయో చూడాలి. ఇక అన్నింటికి మించి మరి ఈసారైనా చెప్పిన సమయానికి ఈ భారీ మల్టీస్టారర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.