Bigg Boss: బిగ్ బాస్.. బిగ్ బాస్.. ప్రస్తుతం ఏ భాషలో చూసినా ఈ షో ను బ్యాన్ చేయాలనీ ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. అయితే ఇవేమి పట్టని బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం సీజన్ల మీద సీజన్లను నడిపిస్తోంది. ఇక తెలుగులోనైనా కొంచెం సెన్సార్ కట్ ను ఉపయోగిస్తున్నారు కానీ బాలీవుడ్ లో అయితే అసలు సెన్సార్ లేకుండా నడిచే షో బిగ్ బాస్.. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 16 మొదలయ్యింది. బాలీవుడ్ లో వివాదాస్పద నటీనటులను ఒకచోట పోగేసి కొట్టుకోమని వదిలేశారు. ఇక ఈ కంటెస్టెంట్లలలో ప్రస్తుతం అందరి చూపు బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పైనే ఉంది. హిమ్మత్ వాలా, హౌస్ ఫుల్ లాంటి వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ ఈసారి బిగ్ బాస్ 16 లో పాల్గొన్నాడు. అయితే బయట ఇతగాడిపై ఉమనైజర్ అనే ముద్ర ఉంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది హీరోయిన్స్ ను సాజిద్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సోషల్ మీడియా వేదికలో హీరోయిన్స్ ను ఇష్టం వచ్చినట్లు క్రిటిసైజ్ చేసి మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు దేశం మొత్తం చూసే బిగ్ బాస్ షో లో ప్రత్యక్షమయ్యాడు. అతడిని సపోర్ట్ చేసి విన్నర్ చేయండి అంటూ కొంతమంది అభిమానులను అడుగుతున్నారు. అయితే నెటిజన్లు మాత్రం బిగ్ బాస్ యాజమాన్యం మీద, ప్రసారం చేస్తున్న ఛానెల్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛీ సిగ్గుగా లేదు.. హీరోయిన్స్ ను లైంగికంగా వేధించినవాడికి సపోర్ట్ ఇవ్వమంటున్నారు.. ఇది మీ బుద్ధి అంటూ విరుచుకుపడుతున్నారు. అతడిని గెలవనీయ్యకుండా చేయాలి అని అని అంటుండగా.. మరికొందరు బిగ్ బాస్ షో లో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు. మరి సాజిద్ ఖాన్ ఎన్నిరోజులు హౌస్ లో ఉంటాడో చూడాలి.