సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు.. ఎవరినైనా ట్రోల్ చేయోచ్చు. మనస్సులో అనుకున్న భావాన్ని ఎదుటివారి ముందు పెట్టేస్తారు. అది మంచి అయినా చెడు అయినా.. అయితే ఈ విషయంలో నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కొన్నిసార్లు ఓవర్ గా మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొంటారు. తాజాగా బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా కొద్దిగా ఓవర్ గా మాట్లాడి నెటిజన్స్ ట్రోల్స్ కి బలవుతున్నాడు.
ఇటీవల అక్షయ్ ఒక వీడియోలో మాట్లాడుతూ” ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతూ నిత్యం వ్యాయామం చేయాలనీ, అలా చేస్తే ఫిట్ గా ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రోజు గంట వ్యాయామం చేయని వారు చచ్చిపోండి అంటూ కొద్దిగా నోరు జారాడు. ఇంకేముంది ఈ మాటను నెటిజన్స్ పట్టుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అక్షయ్ ని ఆడేసుకుంటున్నారు. క్లాస్ మధ్యలో మా పిటి సర్ ఇలాగే క్లాస్ లు పీకుతారు అని కొందరు.. దేశీ నాన్నలు ఉదయాన్నే కొడుకులు లేవకపోతే ఇలాగే తిడతారని మరికొందరు ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
i spat out my coffee pic.twitter.com/AqZ5OxhI2X
— tavi ツ (@oddtavish) February 3, 2022