జూనియర్ సమంత గా పేరుతెచ్చుకొని సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అషూ రెడ్డి. ఇక ఈ ఫేమ్ తోసెయ్ బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టి మరింత పేరు తెచ్చుకుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. ఫ్యాషన్ ఐకాన్ లా అరకొర బట్టలు వేసుకొని కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ మీద చాలామంది చాలా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇకఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన స్నేహితుడు అజయ్ తో కలిసి ఒక రీల్ చేసింది. మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్‌పై రీల్ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ వయ్యారాలు పోతూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ మీ మనసులో మాట చెప్పండి అంటూ నెటిజన్స్ కి ఒక పెద్ద టాస్క్ ఇచ్చింది. ఇంకేముంది.. అస్సలే ఈ భామ చేసిన పనులు, ఓవర్ యాక్షన్ గుర్తు తెచ్చుకున్న ట్రోలర్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘ముందు మేకప్ తీసి రీల్ చేయ్ గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చేయ్’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే’ అంటూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు వాయించేస్తున్నారు. మరో పక్క ఆమె అభిమానులు మాత్రం చాలా బావుంది, సూపర్ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.