Siddharth: శుద్ధ పూసలా కబుర్లు చెప్పొద్దు.. అంటూ సిద్దార్థ్ పై నెటిజన్స్ కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించిన హీరోల్లో సిద్దార్థ్ ఒకరు. లవర్‌బాయ్‌గా అద్భుతమైన ప్రేమ కథ చిత్రలో నటించిన సిద్ధుకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. కానీ ప్రజెంట్ టాలీవుడ్ లో సిద్ధికి ఆఫర్ లు పూర్తిగా కరువయ్యాయి. ఆపై మాతృ భాష తమిళ్ లో సినిమాలు చేసుకుంటున్నప్పటికి.. అక్కడ కూడా సిద్దార్థ్‌కు చాలా ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేదు. ఐతే ఎప్పుడు తన సినిమాల ప్రమోషన్ల టైం లో గత వైభవం గురించి మాట్లాడుతూ.. తన ప్రస్తుత చిత్రాలు సరిగా ఆడకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తుంటాడు సిద్ధు. కొన్నిసార్లు తన కెరీర్ దెబ్బ తినడానికి కారణం వారే అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులను విమర్శిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా తాజాగా ఒక కార్యక్రమంలో తాను పెద్ద స్టార్ కాకపోవడానికి చెప్పిన కారణాలు చర్చనీయాంశం అయ్యాయి.
Also Read:Surya: నా తండ్రిని చూసి గర్వపడుతున్నా అంటూ సూర్య ఎమోషనల్
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
సిద్ధు మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌ల నడుములు గిల్లే, వాళ్లను చెంపదెబ్బ కొట్టే సీన్లు.. వాళ్లను కించపరిచేలా ఉన్న సన్నివేశాలు ఉండడం వల్ల చాలా సినిమాలు నేను రిజెక్ట్ చేశాను.. అందుకే పెద్ద స్టార్ కాలేక పోయా’ అని సిద్ధు తెలిపాడు. అయితే ఈ మాటలపై నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో తను నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆట’ సినిమాలో ఇలియానాతో కలిసి అతను చేసిన రొమాంటిక్ సాంగ్స్.. అందులో హీరోయిన్ కట్టుకుని ఉన్న టవల్ తీసి ఆమెతో పాటు చుట్టుకునే సన్నివేశం తాలూకు వీడియో తీసి.. ‘ఇలాంటి సీన్లు విషయంలో ఏ అభ్యంతరాలు లేకుండా నటించి ఇప్పుడు శుద్ధ పూసలా కబుర్లు చెబితే ఎలా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘గృహం’ లాంటి చిత్రాల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్ల మాటేంటి.. ఇలాంటి స్టెట్‌మెంట్‌లు పాస్ చేసెముందు కొంచెం ఆలోచించి మాట్లడండి సార్..అంటూ సిద్ధు పై నెటిజన్లు కామెంట్‌ల వర్షం కురిపిస్తుంది. మరి ఈ కౌంటర్లకు సిద్ధు ఏమని రియాక్ట్ అవుతాడో చూడాలి?
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!