Gaami: విశ్వక్ గామిపై నెగటివ్ ప్రచారం.. రంగంలోకి బాట్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Negative Ratings with Bots for Vishwak Sen Gaami Movie: విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మార్చి 8వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. విద్యాధర కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మొదట క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని అనుకున్నారు. 40% షూటింగ్ పూర్తి అయిన తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ టేక్ అప్ చేసి సినిమాను నిర్మించింది. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆఫ్ బీట్ సినిమా కావడంతో అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువే కానీ ఎక్కువగా విమర్శకుల నుంచి మాత్రం సినిమాకి ప్రశంసలు దక్కాయి.
STHREE: మహిళా శక్తిని చాటేలా ‘స్త్రీ’ మ్యూజికల్ ఆంథమ్
Also Read
అయితే ఈ సినిమా మీద బుక్ మై షో లో నెగిటివ్ రేటింగ్స్ వేయిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో హనుమాన్, గుంటూరు కారం సినిమాలకు ఎలా అయితే కావాలని కొన్ని బాట్స్ ద్వారా నెగిటివ్ రేటింగ్స్ ఇప్పించారో, ఇప్పుడు ఈ సినిమాకి కూడా అదే విధంగా నెగిటివ్ రేటింగ్ ఇప్పిస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఈ విషయం మీద సినిమా యూనిట్ కూడా దృష్టి పెట్టింది. ఎలా ముందుకు వెళ్లాలనే విషయం మీద ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చాందిని చౌదరి, అభినయ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి విశ్వక్సేన్ కెరియర్లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలో కూడా సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా విషయంలో సినిమా యూనిటీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..