NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జూన్ 25న పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని మొదట ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ బడ్జెట్ విషయంలో నందమూరి బాలకృష్ణ కొంత సంకోచిస్తున్నట్లు ఈ స్థాయిలో రిస్క్ తీసుకోవడానికి ఆయన ఆలోచిస్తున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ఇక సోషల్ మీడియాలో మరియు కొన్ని వర్గాలలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. అసలు ఈ విషయంలో వాస్తవాలు ఏంటని ఆరాతీయగా NBK112 ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే ప్రచారంలో నిజం లేదని తెలిసింది. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయగా షూటింగ్స్ కు గ్యాప్ ఇచ్చారు. బాలయ్య కోలుకున్నాక షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల. అలాగే ముందు అనుకున్న బడ్జెట్ ను కాస్త తగ్గించేలా కూడా సమాలోచనలు చేస్తున్నారట. వన్స్ బాలయ్య షూట్ లో జాయిన్ అయితే ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా షూట్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
- JoJo : 'జోజో' ఫస్ట్ లుక్.. 'మనోభావాల బ్యాచ్'కి స్వీట్ వార్నింగ్
- #PrabhasDP : 7 ఏళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియా షేక్..షేక్
- Viswanath and Sons Review: విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ.!
తాజావార్తలు
-
Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Ampere Magnus G Max: 30కి పైగా కొత్త ఫీచర్లతో అప్డేట్ అయిన Ampere Magnus G Max.. 142km రేంజ్, ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!