NBK111 : ‘బాలయ్య – నర్గిస్ ఫక్రి’ దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం NBK111 శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. నిన్నటితో ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఫినిష్ చేసారు మేకర్స్. బాలీవుడ్ హీరోయిన్ నర్గిస్ ఫక్రి బాలయ్య సరసన చిందేసింది. గతంలో బాలయ్య – గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక బాలయ్య సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. దబిడి, దిబిడి సాంగ్ తో ఊపు ఊపేసిన ఈ కాంబో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే రేంజ్ మాస్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య మార్క్ స్టెప్పులతో ఈ పాట థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ స్పెషల్ సాంగ్ షూట్ ముగియడంతో తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. త్వరలోనే ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు టాకీ పార్ట్‌ను చిత్రీకరించనున్నారు. అనంతరం జూన్ నెలలో విదేశీ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ప్రమోషన్ల విషయంలో కూడా మేకర్స్ వేగం పెంచారు. సినిమా టీజర్‌కు సంబంధించిన ఎడిటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బాలయ్య బర్త్ డే కానుకగా పవర్ఫుల్ టీజర్ అప్డేట్తో అభిమానులను అలరించేందుకు గోపీచంద్ మలినేని టీమ్ రెడీ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!