NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 111వ మైలురాయిగా మలుచుకుంటున్న భారీ ప్రాజెక్టు #NBK111 నుంచి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకున్న ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార స్థానంలోకి ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత బాలయ్య-నయన్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఒక భారీ చిత్రంలో నటిస్తోంది. దీనివల్ల ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయడం మేకర్స్‌కు కష్టతరంగా మారింది.
ఈ సినిమా కోసం నయనతార దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, ఆమె సినిమాల ప్రమోషన్లలో పాల్గొనదు కూడా. ఈ కారణాల రీత్యా మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపారు. నయనతార ఎగ్జిట్ అవ్వగానే, దర్శకుడు గోపీచంద్ మలినేని టీమ్ వెంటనే కాజల్ అగర్వాల్‌ను సంప్రదించారు. కాజల్ ఈ సినిమా కోసం చాలా తక్కువ పారితోషికానికి అంగీకరించడమే కాకుండా, ప్రమోషన్స్ విషయంలో కూడా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చిందట. గతంలో బాలయ్యతో కలిసి ‘భగవంత్ కేసరి’లో నటించినప్పటికీ, అందులో కాజల్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్‌లో కనిపించబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!