NBK109:నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది సంక్రాంతికి బాలయ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిరుతో పోటీపడి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భగవంత్ కేసరి మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ బాబీ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.అదే ఊపు లో నందమూరి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.బాలకృష్ణ 109 వ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. నందమూరి అభిమానులంతా ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ను మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక టైటిల్ గా NBK109 అనే చూపించడం విశేషం.. NBK అంటే నేచురల్ బోర్న్ కింగ్ (natural born king) అని చెప్పుకొచ్చారు.
ఇక గ్లింప్స్ విషయానికొస్తే బాలయ్య ఊచకోత మరోసారి కనిపించింది. బాలయ్యను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో చూడాలనుకున్నారో.. బాబీ ఆ రేంజ్ లోనే చూపించాడు. అడవిలో కార్చిచ్చు మధ్య.. నటసింహం కారులో నుంచి దిగడం.. బాక్స్ ఓపెన్ చేయడం మ్యాన్షన్ హౌస్ కనిపించడమే హైలైట్ గా మారింది అనుకుంటే.. బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో అదరకొట్టాడు. అడివి మధ్యలో విలన్స్ ను చితకబాదుతూ.. సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్ .. హంటింగ్ అంటూ పవర్ ఫుల్ గా చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య సినిమా అంటే చాలు థమన్ డ్యూటీ ఎక్కేస్తాడు. గ్లింప్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి టైటిల్ అదేనా, వేరే ఇంకేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
