నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత.. దర్శకుడు గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీలె ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన మాస్ లుక్‌ని రివీల్ చేయగా.. ఈ సినిమా మరో అఖండ ఖాయమని ఫిక్స్ అయిపోయారు నందమూరి అభిమానులు. అందుకు తగ్గట్టుగానే.. ఈ సినిమా నుంచి అదిరిపోయే మాసివ్ అప్టేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. జూన్ 10న బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమాకి సంబంధించిన బిగ్ అప్టేట్ ఇవ్వబోతున్నారని వినిపిస్తోంది.
అందులోభాగంగా.. అదిరిపోయేలా పవర్ ఫుల్ ప్రీ లుక్ పోస్టర్‌తో.. ఫస్ట్ హంట్ లోడింగ్ అంటూ.. అనౌన్స్ చేశారు. అలాగే సింహం వేటకి సిద్దమైందని.. చెప్పుకొచ్చారు మేకర్స్. దాంతో బాలయ్య ఫ్యాన్స్.. ఈ సారి నటసింహం వేట ఎలా ఉంటుందోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే టీజర్ రిలీజ్ చేస్తారా.. లేక టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారా.. అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు అన్నగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ రానుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నారు బాలయ్య. బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా అప్టేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ ఫిల్మ్‌లో శ్రీలీల బాలయ్య కూతురిగా నటించబోతోంది. మొత్తానికి ఈ సారి బాలయ్య బర్త్ డే డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు.