Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తరువాత గుళ్ళు గోపురాలు తిరుగుతూ కనిపించింది. పెళ్ళైన దగ్గరనుంచి అమ్మడికి వివాదాలకు మాత్రం తక్కువ లేదు. పెళ్లి తరువాత మొదటిసారి గుడికి వెళ్తూ చెప్పులు వేసుకొని కనిపించి ఒక వివాదానికి తెరలేపింది. ఆ తరువాత సరోగసీద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఇక్కడితో వివాదాలు ముగిశాయి అనుకొనేలోపు మరో వివాదానికి తెరలేపింది. తాజాగా విగ్నేష్- నయన్ దంపతులు తమిళనాడు రాష్ట్రం కుంభకోణం సమీపంలోని మెళవత్తూర్ గ్రామంలోని కామాక్షి అమ్మవారి ఆలయంను సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక నయన్ వచ్చిందని తెలియడంతో అభిమానులు ఆమెను చూడడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు.
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు..?
గర్భగుడిలోకి కూడా ప్రవేశించడానికి జనాలు తోసుకుంటూ ఉండగా .. నయన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ” ఒక్క ఐదు నిముషాలు ఆగలేరా..? నేనూ మీలానే పూజ చేయించడానికి వచ్చాను. అమ్మవారి దర్శనం చేసుకోనివ్వరా” అంటూ జారీచేసింది. ఆ తరువాత ఒక అభిమాని నయన్ ను ఫాలో చేస్తూ ఆమె దగ్గరకంటా వచ్చి ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించగా.. అతడిపై కూడా నయన్ ఫైర్ అయ్యింది. ఇంకోసారి ఫోన్ లో ఫొటో లేదా వీడియోను రికార్డ్ చేస్తే కచ్చితంగా మొబైల్ ఫోన్ పగిలిపోద్ది చెప్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సదురు అభిమాని ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం నయన్.. షారుఖ్ సరసన జవాన్ లో నటిస్తోంది.