Site icon NTV Telugu

Nayanathara: రెమ్యునరేషన్‌ పెంచినా.. సీనియర్ హీరోలకు ఆమె తప్ప దిక్కులేదా?

Nayanathara

Nayanathara

సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే, సినిమా ఒప్పందం సమయంలోనే తాను ప్రచార కార్యక్రమాలకు రానని ముందే కండిషన్ పెడుతుంటారు. కానీ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం అనిల్ రావిపూడి తన మాయాజాలంతో నయన్‌ను ఒప్పించగలిగారు, ఫలితంగా ఆమె ఈ సినిమా కోసం రెండు ప్రత్యేక ప్రమోషనల్ వీడియోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీడియోల్లో కనిపించినప్పటికీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కానీ, ఇతర ఇంటర్వ్యూల్లో కానీ నయనతార ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆ రెండు వీడియోలకే ఆమె పరిమితమయ్యారు. అయితే, నెలాఖరులో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న ‘మెగా సక్సెస్ సెలబ్రేషన్స్’ కైనా ఆమె హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అనిల్ రావిపూడి కోసం ఆమె మళ్ళీ మనసు మారుస్తారేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read :Allu Arjun: అల్లు అర్జున్‌కు తెలుగు డైరెక్టర్స్‌ నచ్చడం లేదా?

చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఇప్పటి యంగ్ హీరోయిన్లు సరిగ్గా సరిపోవడం లేదు, ఈ క్రమంలో సీనియర్ హీరోలకు గ్లామర్ మరియు నటన పరంగా నయనతారే బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నారు. దక్షిణాదిలో గత పదేళ్లుగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్‌గా నయనతార రికార్డు సృష్టించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సక్సెస్‌తో ఆమె తన రెమ్యునరేషన్‌ను ఏకంగా 15 కోట్లకు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది, సీనియర్ హీరోలకు ఆమె అనివార్యంగా మారడంతో, నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనకాడటం లేదు.
ప్రస్తుతం నయనతార తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సరసన నయనతార నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. సినిమా సైన్ చేశామా.. షూటింగ్ పూర్తి చేశామా అన్నట్టు ఉండే నయనతార, ఇప్పుడు ప్రమోషన్ల విషయంలో కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది, మరి మెగా సెలబ్రేషన్స్ వేదికపై ఆమె కనిపిస్తారో లేదో చూడాలి!

Exit mobile version