సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే, సినిమా ఒప్పందం సమయంలోనే తాను ప్రచార కార్యక్రమాలకు రానని ముందే కండిషన్ పెడుతుంటారు. కానీ, ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం అనిల్ రావిపూడి తన మాయాజాలంతో నయన్‌ను ఒప్పించగలిగారు, ఫలితంగా ఆమె ఈ సినిమా కోసం రెండు ప్రత్యేక ప్రమోషనల్ వీడియోల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీడియోల్లో కనిపించినప్పటికీ, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కానీ, ఇతర ఇంటర్వ్యూల్లో కానీ నయనతార ఎక్కడా కనిపించలేదు. కేవలం ఆ…