Site icon NTV Telugu

Nayanthara: నయన్ సినిమా బ్యాన్.. ఓటిటీ నుంచి కూడా డిలీట్

Untitled 1

Untitled 1

Nayanthara: కోలీవుడ్ హీరోయిన్ నయనతార పెళ్లి తరువాత చాలా సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటుంది. ఇక ఆ సినిమాలను కూడా తన బ్యానర్ లోనే నిర్మిస్తూ వస్తుంది. ఇక తన కెరీర్ లోనే 75 వ సినిమాగా తెరకెక్కిన చిత్రం అన్నపూరణి. గతేడాది డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా ఎన్నో వివాదాలను రేకెత్తించింది. కొద్దిరోజుల క్రితం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తమిళ్‌, తెలుగు,హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉందంటూ ఫిర్యాదులు రావడంతో ‘అన్నపూరణి’ చిత్రాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ తొలగించింది. ఇందులో ఒక బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ ను తినడం, వండడం లాంటివి చేస్తుందని కొందరు కేసు వేయగా.. ఇంకొంతమంది లవ్ జిహాద్ ను ప్రోత్సహించిందని కేసు వేశారు.

ముఖ్యంగా శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. దీంతో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని ఏ మాత్రం సీరియ‌స్ చేయ‌కూడ‌ద‌ని భావించిన జీ స్టూడియోస్ విశ్వ హిందూ ప‌రిష‌త్ కి క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేసింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ నుండి టైటిల్‌ను కూడా తొల‌గించారు.అయితే ఈ సినిమాను పూర్తిగా తొలగిస్తారా.. ? టైటిల్ ను మర్చి, కొన్ని సన్నివేశాలను తొలగించి మళ్లీ రిలీజ్ చేస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version