Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఆమెను ఎవరో ఒకరు టార్గెట్ చేస్తూనే ఉంటారు. మనకు తెలిసిందే కదా.. నయనతార చాలా మందితో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది. గతేడాది ఆమె లైఫ్ స్టోరీ ఆధారంగా నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేయిల్ అనే డాక్యమెంటరీ తీశారు. ఇందులో గతంలో నయన తార యాక్ట్ చేసిన సినిమాల క్లిప్స్ వాడటం పెద్ద వివాదంగా మారింది. అప్పట్లోనే హీరో ధనుష్ తన మూవీ క్లిప్స్ ను పర్మిషన్ లేకుండా వాడారంటూ రూ.కోటి నష్టపరిహారం కోరుతో కోర్టులో కేసు వేశాడు. అది ఇప్పటికీ వాదనలు నడుస్తోంది. ఈ క్రమంలోనే మరో నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది.
Read Also : Chiranjeevi : మనవడిని చూసి మురిసిపోతున్న చిరంజీవి..
ఏబీ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ పర్మిషన్ లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారంటూ ఆరోపించింది. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో కేసు వేసింది. దీంతో నయనతార తరఫున డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ చిక్కుల్లో పడింది. కౌంటర్ పిటిషన్ వేయాలంటూ డాక్యమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ ను ఆదేశించింది. దీంతో మరోసారి నయనతార వివాదంలో చిక్కుకుంది. వాస్తవానికి అంత చిన్న క్లిప్స్ వాడుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ నయనతార వారితో పెట్టుకున్న గొడవలే ఇలా ఆమెను కాంట్రవర్సీల్లో పడేస్తున్నాయి.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9 లో మరో లవ్ ట్రాక్.. ఏం జరుగుతోంది..?
