కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. గతంలో ఎన్నోసార్లు ఈ వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ జంట ముందు పెళ్లి చేసుకోవాలని, ఆ తరువాత చేతిలో ఉన్న ప్రాజెక్టుల సంగతి చూడాలని అనుకుంటున్నారట. 2015లో వచ్చిన “నేనూ రౌడీనే” అనే సినిమా చిత్రీకరణ సమయంలో నయన్, విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ జంట రిలేషన్ షిప్ లో ఉండగా, ఇప్పటికే దాదాపు ఆరేళ్ళు పూర్తయ్యాయి. ఇక ఈ జంట అధికారికంగా తమ రిలేషన్ షిప్ స్టేటస్ ను బయట పెట్టినప్పటి నుంచి అభిమానులు నయన్, విగ్నేష్ పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : Kangana Ranaut : ఆరేళ్ళకే లైంగిక వేధింపులు… క్వీన్ షాకింగ్ కామెంట్స్
ఇప్పటికే నయన్-విగ్నేష్ పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోగా, ఈ ఏడాది జూన్ లోగా ఒక ఇంటివారు కావడం ఖాయం అంటున్నారు. ఈ మధ్య కాలంలో విఘ్నేష్ శివన్, నయనతార చాలా దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక ట్రిప్ లు కూడా అందుకే అంటున్నారు. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో “AK 61” మూవీ తెరకెక్కనుంది. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలోగానే నయన్, విగ్నేష్ ఏడడుగులు నడవబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం జోరందుకుంది. ప్రస్తుతం విగ్నేష్ దర్శకత్వంలో సమంత, నయన్, విజయ్ దెతుపతి ప్రధాన నటించిన “కన్మణి రాంబో ఖతీజా” సినిమా ఏప్రిల్ 28న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రమోషన్లలో పెళ్లి విషయంపై ఈ స్టార్ జంట క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.