Site icon NTV Telugu

Samantha: లేడీ సూపర్ స్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. మురిసిపోతున్న సామ్

samantha

samantha

సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలను ఒప్పుకోవడమే కాదు వెంటవెంటనే వాటిని పూర్తి చేసి ఔరా అనిపిస్తుంది. విడాకుల తరువాత అమ్మడు స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్లో శాకుంతలం చిత్రాన్ని పూర్తిచేసిన సామ్ తాజాగా తన కోలీవుడ్ మూవీ కాతువాకుల రెండు కాదల్‌ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసింది. లేడీ సూపర్ స్టార్ నయన్ తార, విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ షూటింగ్ సమయంలోనే నయన్, సామ్ ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

సినిమా పూర్తి అవవడంతో నయన్, సామ్ కి ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ‘డియర్ ఖతీజా.. విత్ లవ్.. కణ్మణి’ కాస్ట్‌లీ ఇయర్ రింగ్స్ ని సామ్ కి బహుమతిగా పంపించింది నయన్. ఈ విషయాన్ని సామ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులు తెలుపుతూ నయన్ కి థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో సామ్ కోలీవుడ్ లో మరో హిట్ ని అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version