Site icon NTV Telugu

Valentine’s Day : అర్ధరాత్రి ప్రియుడికి నయన్ సర్ప్రైజ్… వీడియో వైరల్

Nayantara

Nayan tara

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమకు సంబంధించిన పలు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. అందులో నయన్ తనను ఎలా సర్ప్రైజ్ చేసిందో చూపించారు. ఈ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఆమె వచ్చి పువ్వులు ఇచ్చినప్పుడు… మొదటి సారి లాగానే 🙂 ఇది ఖచ్చితంగా సంతోషకరమైన విషయం… ప్రేమికుల రోజు శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్ శివన్.

Read Also : Manjima Mohan : ప్రియుడితో నాగ చైతన్య హీరోయిన్ పెళ్లి

లేడీ సూపర్‌స్టార్‌తో కలిసి ఉన్న కొన్ని కొత్త రొమాంటిక్ ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు. “చుట్టూ ఉన్న అందమైన వ్యక్తులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు! ప్రేమ జీవితాన్ని పూర్తి చేస్తుంది. అందుకే ప్రేమలో ఉండటానికి సమయం, ఆసక్తిని కలిగి ఉండండి… ప్రేమను పొందండి!” అంటూ హృదయపూర్వకమైన నోట్‌ షేర్ చేశారు. ఈ వీడియోలో నయనతార అర్థరాత్రి పూలగుత్తితో విగ్నేష్ వద్దకు వచ్చి, వెచ్చని కౌగిలింత ఇచ్చేసింది. ఇక విగ్నేష్ ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/nayantharafeeds/status/1493141945958662144
Exit mobile version