Site icon NTV Telugu

Nayan and Vignesh Marriage : నయన్, విఘ్నేష్ నెట్‌ఫ్లిక్స్ కి 25 కోట్లు కట్టాల్సిందేనా!?

Nayanatar Anetflix

Nayanatar Anetflix

Nayan and Vignesh Marriage :
నయనతార విఘ్నేష్ శివన్‌ నెట్‌ఫ్లిక్స్ సంస్థకు 25 కోట్లు కట్టాలట. ఈ మేరకు ఆ సంస్థ నుంచి నోటీస్ లు కూడా వచ్చినట్లు సమాచారం. అంత మొత్తం ఎందుకంటే అది నెట్ ఫ్లిక్స్ వారికి చెల్లించిన సొమ్మే. గత నెల 9వ తేదీన నయన్, విఘ్నేష్ పెళ్ళి మహాబలిపురంలో వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి సంబంధించిన వీడియో స్ట్రీమింగ్ హక్కులను ఈ జంట నెట్ ఫ్లిక్స్ కి 25 కోట్లకు అమ్మేసింది. అందుకు గాను ఆ సంస్థ వీరితో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం పెళ్ళి ఏర్పాట్లు, హోటల్ బుకింగ్స్, సెక్యూరిటీ, విందు భోజనాల కోసం నెట్ ఫ్లిక్స్ నే నగదు చెల్లించిందట.
ఆ తర్వాత నయన్-విఘ్నేష్ వివాహ వేడుకల తతంగాన్ని ఇప్పటి వరకూ ప్లే చేయలేదు. దీనికి నెట్ ఫ్లిక్స్ నయన్, విఘ్నేష్ తో ఈ డీల్ రద్దుచేసుకోవడమే కారణమని చెబుతున్నారు. ఈ పెళ్ళి వేడుకకు సబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే అవన్నీ విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే బయటకు వచ్చాయి. అందుకే నెట్‌ఫ్లిక్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుందట. ఈ వేడుకకు సంబంధించి అన్ని హక్కలు తమకే ఉండగా… రజనీకాంత్, షారుఖ్ ఖాన్, మణిరత్నం, అట్లీ జంటతో కలిసి ఉన్న చిత్రాలను విఘ్నేష్ ఇన్‌ స్టాలో షేర్ చేశాడు.
అలా ఆత్యుత్సాహంతో డీల్ ని ఉల్లంఘించినందుకు నెట్‌ఫ్లిక్స్ ఒప్పందాన్ని రద్దు చేసిందట. అంతే కాదు తాము కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని నెట్‌ఫ్లిక్స్ నోటీసులు పంపిందట. సో నయన్, విఘ్నేష్ నెట్ ఫ్లిక్స్ కి 25 కోట్లు చెల్లించాల్సిందే అంటున్నారు. ఎరక్క పోయి పిక్స్ షేర్ చేసి ఇరుక్కు పోయిన జంట ఆ మొత్తాన్ని చెల్లిస్తుందా? లేక న్యాయపోరాటం చేస్తుందా? అన్నది చూడాలి.

Exit mobile version