ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టికెట్ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ హీరో చిరంజీవి, బడా నిర్మాత సురేష్ బాబు, తాజాగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు స్పందించి అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని, ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని కోరారు. అయితే తాజాగా యంగ్ హీరో నవదీప్ ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్ పై ‘టమాట’ సెటైర్ వేశాడు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం “సినిమా టిక్కెట్ వర్సెస్ టమాట?” అని ట్వీట్ చేశాడు.
Read Also : సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?
Also Read
సినిమా టిక్కెట్ల ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ఇక నుంచి నిర్మాతలు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ టిక్కెట్ ధరలు పెంచే అవకాశం లేదు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలకు ఒకే టికెట్ ధర ఉంటుంది. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా కొరత కారణంగా టమాట ధరలు పెరుగుతున్నాయి. ఈ రెండు అంశాలను పోల్చిన నవదీప్… ఏపీలో కిలో టమాట ధర కంటే ఒక్క సినిమా టిక్కెట్ ధర తక్కువని పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరాడని అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల విషయంలో చాలా మంది టాలీవుడ్ పెద్దలు మౌనంగా ఉండగా, నవదీప్ ప్రభుత్వంపై ఈ సెటైర్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. ఈ ‘టమోటా’ సెటైర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!