సల్మాన్ అభిమానుల పిచ్చి పీక్స్… థియేటర్లో చేయాల్సిన పనేనా ఇది ?

సినిమా ప్రపంచంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అభిమానులకు పండగే. ఇక ఇటీవల ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సల్మాన్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘యాంటీమ్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కన్పించారు. నవంబర్ 26 న విడుదలైన చిత్రంలో ఆయుష్ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. అల్టిమేట్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. సినిమాకు మొదటి రోజు నుంచే మంచి స్పందన వస్తోంది. అయితే థియేటర్లో సల్మాన్ అభిమానులు చేసిన పిచ్చి పని ఒకటి చర్చనీయంశంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సల్మాన్ అభిమానులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !

సల్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ‘యాంటీమ్’ ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్లో అభిమానులు టపాసులు పేలుస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాని వల్ల మిగతా ప్రేక్షకులు సైతం ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ థియేటర్లో ఇలా టపాసులు పేల్చడం మీకు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి ప్రమాదకరం. థియేటర్ల యజమానులు ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదు. ఎంట్రీలోనే ఇలాంటి పనులు చేయకుండా అడ్డుకోవాలి. సినిమాను ఎంజాయ్ చేయండి కానీ ఇలా కాదు. అభిమానులకు ఇదే నా రిక్వెస్ట్… దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ధన్యవాదాలు” అంటూ సల్మాన్ వీడియోలో చెప్పుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

Related Articles

Latest Articles