Natural Star Nani Speech At Dasara Pre Release Event: సీడెడ్ అంటే మాస్ అంటారని.. ఇన్ని రోజులు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు, కానీ మీ గుండెల్ని హత్తుకునే మాస్‌ని ‘దసరా’తో చూపిస్తానని నేచురల్ స్టార్ నాని హామీ ఇచ్చాడు. సాధారణంగా మాస్ అన్నప్పుడు విజిల్స్ వేస్తుంటామని, కానీ దసరాలోని మాస్ చూశాక మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని, దానికితోడు విజిల్స్ కూడా వేస్తారని పేర్కొన్నాడు. ఈ సినిమాతో కచ్ఛితంగా ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇది తన మనసుకి చాలా దగ్గరైన సినిమా అని.. ఒక సంవత్సరం పాటు ఆ దుమ్ము, ధూళిలో చాలా కష్టపడి పని చేశామని తెలిపాడు. ఈ సినిమా కోసం తన చిత్రబృందం ఎంతో కష్టపడిందని, వాళ్లందరికీ ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పాడు. ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్న ప్రతిఒక్కరి జీవితంలోనూ ఈ సినిమా చాలా ప్రత్యేకంగా, మెమొరబుల్‌గా నిలిచిపోతుందని అన్నాడు.
Ashu Reddy: జూనియర్ సమంత అందాలతో అర్ధరాత్రి పిచ్చెక్కిస్తోంది
ఇతర సినిమాలతో పోలిస్తే.. ఇందులో తన స్నేహితులుగా నటించిన వారి పాత్రలు చాలా భిన్నమని నాని తెలియజేశాడు. ఏదో సినిమాలో పాత్రల్లో కాకుండా, రియల్ లైఫ్ స్నేహితులుగా అందరూ ఆ పాత్రలకు జీవం పోశారని.. 80 ఏళ్ల తర్వాత కలుసుకుంటే, మళ్లీ ఆ పాత్రల గురించి ప్రస్తావించుకునేంత గొప్ప బాండింగ్ తమ మధ్య ఏర్పడిందని చెప్పాడు. ఈ దసరా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, దసరా మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నాడు. ఇక కాసర్ల శ్యామ్ రాసిన ప్రతీ లిరిక్ సెన్సేషన్‌గా మారిందని, ఇకపై ఆయన పాటల కోసం మ్యూజిక్ కంపెనీలు క్యూ కడతాయని వెల్లడించాడు. ఈ సినిమాలో ఫైట్స్ సమకూర్చిన సతీన్ చూడ్డానికి చిన్న కుర్రాడిలా కనబడతాడు కానీ, ఊహకు అందని యాక్షన్ సీక్వెన్స్ తీర్చిదిద్దాడని, సినిమా చూశాక అందరూ ఆశ్చర్యపోవడం ఖాయమని, వేరే లెవెల్‌లో వాటిని సమకూర్చాడని తెలిపాడు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ తమ సినిమా కోసం 22 ఎకరాల్లో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేశారని, ఆయన పనితనం గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువేనని కొనియాడాడు.
Dinesh Karthik: అతడు లేకపోతే.. టీమిండియా రాణించడం కష్టం
ఈ సందర్భంగా ప్రతీ టెక్నీషియన్‌కి, కో-యాక్టర్స్‌కి ధన్యవాదాలు తెలిపిన నాని.. అసిస్టెంట్ డైరెక్టర్లకు మాత్రం పేరుపేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్లంతా ఈ సినిమా కోసం పడ్డ కష్టం మాటల్లో వర్ణించలేనిదని, కచ్ఛితంగా దసరా తర్వాత వాళ్లు సంవత్సరంలోపే దర్శకులుగా మారాలని కోరుకుంటున్నానని అన్నాడు. నేను లోకల్ తర్వాత తాను, కీర్తి సురేశ్ ఒక మెమొరబుల్ సినిమా చేయాలని అనుకున్నామని.. ‘దసరా’కి మించిన మెమొరబుల్ సినిమా ఏ యాక్టర్‌కి దక్కదని పేర్కొన్నాడు. ఈ సినిమా తర్వాత కీర్తి ‘వెన్నెల’గా పాపులారిటీ గడిస్తుందని చెప్పాడు. టాప్ లేచిపోయే సినిమాను మీకు (సినీ ప్రియుల్ని ఉద్దేశిస్తూ) ఇస్తున్నామని, టాప్ లేచిపోయే రెస్పాన్స్ మీరు మాకిస్తారని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాని తన ప్రసంగాన్ని ముగించాడు.