Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రేమలు’. కేవలం రూ. 3 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.130 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో హీరో నెస్లన్, హీరోయిన్ మమితా బైజుకు సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఈ భారీ సక్సెస్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమలు 2’ ఉంటుందని మేకర్స్ గతంలో ప్రకటించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ‘ప్రేమలు 2’ సీక్వెల్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మేకర్స్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం మొదటి భాగం తెచ్చిన హైప్ మరియు క్రేజ్ మాత్రమే నమ్ముకుని సినిమా చేయలేమని సరైన కథ లేకుండా సీక్వెల్ తీస్తే ప్రేక్షకులను మెప్పించలేమని భావించి సీక్వెల్ ను క్యాన్సిల్ చేశారు మేకర్స్. ‘ప్రేమలు 2’ కోసం దర్శకుడు మరియు టీమ్ ఎంత ప్రయత్నించినప్పటికీ స్క్రిప్ట్ అనుకున్నంత రాలేదని రాసుకున్న స్టోరీకూడా హీరో నస్లీన్ కు నచ్చలేదట.ఈ నేపథ్యంలో మరికొన్ని వర్షన్ రెడీ చేసినప్పటికీ హీరో సైడ్ నుండి రెడ్ సిగ్నల్ రావండతో బలవంతంగా సినిమాను లాగడం కంటే ప్రాజెక్ట్‌ను ఇక్కడితో ఆపేయడమే మంచిదని మేకర్స్ ప్రేమలు 2ను సెల్వ్ చేసేసారు. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ‘ప్రేమలు’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు కాస్త నిరాశ అనిపించినా కథ లేకుండా సీక్వెల్ తో సొమ్ము చేసుకోకుండా సినిమాని ఆపేసిన మేకర్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
Also Read
- NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
- Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?
- NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
- CM Vijay: తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష!
తాజావార్తలు
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
-
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్‌లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..