Site icon NTV Telugu

Naresh Pavithra: నరేష్ కాపురంలో నిప్పులు పోసిన పవిత్ర…

Naresh Pavithra

Naresh Pavithra

నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. నరేష్ హోమ్ బ్యానర్ అయిన ‘విజయకృష్ణ మూవీస్’ తెలుగు ఆడియన్స్ కి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ఇచ్చింది. ఈ బ్యానర్ లోనే ‘మళ్లీ పెళ్లి’ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లు కూడా రిలీజ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా మళ్లీ పెళ్లి టీజర్ కూడా రిలీజ్ అయ్యింది, ఇది సినిమా కథలా కాకుండా నరేష్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చేసిన బయోపిక్ లా కనిపించడం విశేషం.

నరేష్, అతని భార్య రమ్యల మధ్యలో పవిత్ర ఎలా వచ్చింది? అసలు రమ్య ఈ విషయంలో ఎలా ఫీల్ అవుతుంది? నరేష్, రమ్య ఆరోపణలకి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనే మళ్లీ పెళ్లి తెరకెక్కినట్లు ఉంది. సినిమాలో ఆర్టిస్టుల పేర్లు కూడా ఒరిజినల్ నేమ్స్ పెట్టడంతో టీజర్ మరింత రియలిస్టిక్ గా ఉంది. నరేష్, పవిత్ర హోటల్ లో దొరికిన ఎపిసోడ్ ని కూడా టీజర్ లో చూపించారు. “మా ఇద్దరి కాపురంలో పవిత్ర లోకేష్ నిప్పులు పోసింది” అనే డైలాగ్ టీజర్ లో బాగా పేలింది.  ఓవరాల్ గా హగ్స్, కిస్ లు, థ్రిల్స్ తో మళ్లీ పెళ్లి టీజర్ ఆకట్టుకుంది. నరేష్ వైఫ్ రమ్య పాత్రలో నటుడు విజయ్ కుమార్ కూతురు ‘వనితా విజయ్ కుమార్’ నటించింది. మరి ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి రానున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో నరేష్, పవిత్ర లోకేష్ తో పాటు శరత్ బాబు, జయసుధ, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, అన్నపూర్ణ, ప్రవీణ్ యెండమూరి తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version