Naresh-Pavitra: చిత్ర పరిశ్రమ గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంతమంది వారిలా బతకాలి అంటారు.. ఇంకొంతమంది అవి ఒక బతుకులేనా అంటారు. ఇక సెలబ్రటీల పాయింట్ ఆఫ్ వ్యూలో వారు ఏం చెప్తారంటే .. మేము కూడా మనుషులమే.. మాక్కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది అని, అర్ధం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అయితే ఇద్దరిలో ఎవరిది తప్పు కాదు కానీ, సెలబ్రిటీలు చేసే కొన్ని పనుల వలనే వారిని ట్రోల్ చేస్తారు అనేది నెటిజన్ల మాట. అందుకు నిలువెత్తు నిదర్శనం నరేష్- పవిత్ర జంట. ఈ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి అతని ఇష్టం.. కానీ, దాన్ని సోషల్ మీడియా వరకు తెచ్చి, మీడియా ముందు రచ్చ చేసి ట్రోల్ చేసేలా చేసింది మాత్రం వారే అని చెప్పుకొస్తున్నారు. తాజాగా నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి మాట్లాడారు. గతంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తమను అసభ్యకరమైన మాటలతో వేధిస్తున్నారని పవిత్రా, నరేష్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆ యూట్యూబ్ ఛానెల్స్ ను నరేష్ మూడో భార్య రమ్య డబ్బులిచ్చి ఆ విధంగా చేయిస్తుందని కూడా పవిత్రా ఫిర్యాదులో తెలిపింది.
Kriti Kharbanda: కృతి.. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ తోనే సెటిల్ అవుతున్నావా..?
ఇక తాజాగా ఆ కేసు గురించి మాట్లాడడానికి నరేష్ పోలీసులను కలిశాడు. ఈ సందర్భంగా మీడియాతో నరేష్ మాట్లాడుతూ.. కేవలం కేసు ఎలా నడుస్తుందో తెలుసుకోవడానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇది కేవలం తన వ్యక్తిగత విషయం గురించి కాకుండా చిత్ర పరిశ్రమలో వేధింపులకు గురవుతున్న వారందరి గురించి ఈ పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు అందరికి తెలిసిపోతున్నాయి.దాంతో చాలామంది అడ్వాంటేజ్ గా తీసుకొని కాల్స్, మెసేజెస్ పంపిస్తూ వేధిస్తున్నారు. వారందరి తరపున నేను పోరాటం చేస్తున్నాను.. అంతేకానీ కొత్త ఫిర్యాదు ఇవ్వడానికి అయితే రాలేదని అన్నారు. కొత్తగా ఈ గొడవ గురించి చెప్పేది ఏమి లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నరేష్ అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.మీ వయస్సుకు తగ్గ పనులు చేస్తే ఎవరు ట్రోల్ చేయరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
