తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ అనారోగ్య సమస్యలతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థత కారణంగా స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నారాయణ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి, మహేష్ బాబు, సుధీర్ బాబు, రవితేజ, బండ్ల గణేష్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక ఆయన భౌతికకాయం జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకోగా… నాగార్జున, నాగ చైతన్య, ఆదిశేషగిరి రావు, కే.ఎల్. నారాయణ, అభిషేక్ నామా, శేఖర్ కమ్ముల, వి. ఆనంద ప్రసాద్, హర్షవర్ధన్, రామ్మోహన్ రావు, కె.ఎల్. దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్, ప్రసన్నకుమార్, తలసాని సాయి తదితరులు పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Read Also : Salaar Pics Leak : సోషల్ మీడియాలో వైరల్
మరోవైపు ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4.30కి మహాప్రస్థానంలో నారాయణ్ దాస్ కె నారంగ్ అంత్యక్రియలు జరనున్నాయి. కాగా ఆయనకు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో సునీల్ నారంగ్ చిత్రపరిశ్రమలో యాక్టీవ్ గా ఉంటున్నారు.