Nara Rohith : నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ అయింది. కానీ రోహిత్ తండ్రి చనిపోవడంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు తమ పెళ్లికి అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోవడంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రోహిత్ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శిరీష షేర్ చేసింది.
Read Also : Nagarjuna : నాగార్జున దెబ్బకు కదిలిన బాలీవుడ్ హీరోలు..
అది చూసిన వారంతా జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. వీరిద్దరూ ప్రతినిధి 2 సినిమాలో నటించారు. అప్పటి నుంచే ఇద్దరూ ప్రేమలో పడి డేటింగ్ చేశారు. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెప్పి ఒప్పించారు. పెద్దలు కూడా ఓకే చెప్పి ఎంగేజ్ మెంట్ చేశారు. కానీ మధ్యలో రోహిత్ తండ్రి చనిపోవడంతో గ్యాప్ తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వీరి పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నారు. వీరి పెళ్లికి ఇటు సీని పెద్దలు, అటు పొలిటికల్ లీడర్లు రాబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : JR NTR : ఎన్టీఆర్ పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ తొలగిపోయినట్టే..
