నందమూరి క్యాంప్‌లో ప్రస్తుతం రెండు గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు నారా ఫ్యామిలీకి మద్దతుగా ఉండే వారు ఉంటే, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటున్నారు. చాలా ఏళ్లుగా సైలెంట్ వార్‌లా సాగిన ఈ విభేదాలు, ఇప్పుడు మాత్రం బహిరంగంగానే బయటపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉంటూ రాజకీయ విషయాలపై నేరుగా ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. కానీ కొందరు టీడీపీ నేతలు మాత్రం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఎన్టీఆర్ తల్లిని టార్గెట్ చేసిన ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. అదే సమయంలో నారా రోహిత్ చేసినట్టుగా చెబుతున్న కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి.
Also Read : Samantha : నా బాడీ సహకరించడం లేదు.. మొత్తానికి బయటపడిన సామ్
తన సినిమా ‘సుందరాకాండ’ ప్రమోషన్లలో మాట్లాడుతూ, ఇటీవల రిలీజ్ అయిన ‘కూలీ’ ‘వార్ 2’ సినిమాలపై స్పందించారని “కూలీ చూశాను, కొన్ని బ్లాక్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా పర్లేదనిపించింది. కానీ వార్ 2 చూడలేదు. చూడాలనే ఆసక్తి కూడా లేదు. మా ఫ్రెండ్స్ అడిగితే కూలీ చూడమన్నారు” అని ఆయన చెప్పినట్టు వైరల్ అవుతోంది. అయితే అవి నిజం కాదు.. నిజానికి ఆయన వార్ 2 చూడలేదు అని మాత్రమే అన్నారు. ఫ్రెండ్స్ కూలీ సినిమాకు టికెట్స్ తీశారు, వెళ్లాం అని అన్నారు తప్ప అంతకు మించి ఏమీ అనలేదు.