The Paradise: నెట్ ఫ్లిక్స్ లో ప్యారడైజ్.. ఆ సీన్స్ కట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ది ప్యారడైజ్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు OTT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. Netflixలో ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. తెలుగు సహా తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి, ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చాయి కానీ, కంటెంట్ పరంగా చాలా ఫిర్యాదులు మొదటి నుంచీ వినిపించాయి. ఈ నేపథ్యంలో, Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న వెర్షన్ విషయంలో మేకర్స్ కొంచెం జాగ్రత్తలు తీసుకుని, బయట బాగా ట్రోల్ అయిన కొన్ని ఎపిసోడ్లలో మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం.
నిజానికి, గత వారం Netflix Coming Soonలో ఈ సినిమాను యాడ్ చేసినప్పుడు, రన్ టైం రెండు గంటల ముప్పై నిమిషాలు అని చూపించడంతో థియేటర్ వర్షన్ నుంచి ఇరవై నిమిషాల సన్నివేశాలను తొలగించారని అన్నారు. కానీ చివరికి, రెండు గంటల యాభై నిమిషాల నిడివితోనే సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో కీలకంగా తొలగించిన సన్నివేశాలను పరిశీలిస్తే, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన ధూమావతి సాంగ్ విషయంలో కొన్ని మార్పులు చేశారు. ఓటీటీ వెర్షన్ కోసం, నాని తల్లి పాత్రలో కనిపించిన సోనాలి కులకర్ణి చేసిన డ్యాన్స్ బిట్ ను నెట్ ఫ్లిక్స్ నుంచి పూర్తిగా తొలగించారు. అలాగే, ఆ సీన్లో నానితో చేసిన కొన్ని ఫైట్ సీన్స్ కూడా కట్ చేశారు.
Also Read
- Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
- Dhanush - Aishwaryaa: ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
- Ranbir Kapoor: ట్రోలర్లకు స్వీట్ షాక్.. తనపై తానే జోక్ వేసుకొని నవ్వించిన రణ్‌బీర్ కపూర్!
- Salman Khan: సల్మాన్ ఖాన్ సెట్స్‌లో హై సెక్యూరిటీ
ఇక థియేటర్లలో విజువల్ విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను పరిగణలోకి తీసుకుని, కొన్ని కీలక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ రీ వర్క్ చేశారు. అలాగే, థియేటర్ వెర్షన్ పోస్ట్ ఎండ్ క్రెడిట్స్ బాగా ఫాస్టుగా రోల్ అవ్వగా, ఇప్పుడు దాన్ని కాస్త… పేర్లు చదువుకునే విధంగా స్లో చేశారు. అలా సినిమా నిడివిని కరెక్ట్‌గా సెట్ చేశారు.
తాజావార్తలు
-
Chikkadpally Crime: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
-
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!