The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న రా అండ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (#TheParadise). ఈ సినిమా నుంచి రిలీజ్ ఒక సాంగ్‌తో సినిమాపై అంచనాలను స్కై హైకి పెంచారు మేకర్స్. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ ఆగస్టు రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడం లేదని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో చిత్రబృందం ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ మేకర్స్ నుంచి ఈ వారంలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. ఆగస్టు వాయిదా పడటంతో ఈ సినిమాను ఎప్పుడు తీసుకురావాలనే దానిపై నిర్మాతలు (SLV సినిమాస్) కసరత్తులు చేస్తున్నారట. నానికి కలిసివచ్చిన దసరా సెలవుల సీజన్‌ను లేదా వింటర్ హాలిడేస్‌ని క్యాష్ చేసుకునేలా నేరుగా డిసెంబర్ రేసులో ఈ చిత్రాన్ని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
-
Uttam Kumar Reddy: “రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం”.. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
-
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!