The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పైగా ఈ మూవీలో నాని పాత్ర అత్యంత ఆసక్తికరంగా మారింది. అతని చేతిపై.. లం…. కొడుకు అనే టాటూ ఉండటం సంచలనం రేపింది. ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకముందే ఆడియో రైట్స్ తో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా ఈ మూవీ కోసం రూ.18 కోట్లు చెల్లించింది సరిగమ గ్లోబల్ సంస్థ. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.
Read Also : CM Revanth Reddy : క్యాన్సర్ బాధిత కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
ఇలా రిలీజ్ కు ముందే భారీగా బిజినెస్ లెక్కలు మార్చేస్తోంది ఈ సినిమా. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ ని 1980లో హైదరాబాద్ లో జరిగిన కథతో తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కథ, విజువల్స్, నాని గెటప్ అన్నీ టాలీవుడ్ దృష్టిని తమవైపు పడేలా చేస్తున్నాయి. పైగా గతంలో శ్రీకాంత్, నాని కాంబోలో వచ్చిన దసరా మూవీ భారీ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీతో మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు వీరిద్దరూ. ప్రస్తుతం పూర్తి నటీనటులను తీసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
Read Also : Congress : కాంగ్రెస్ లో మహిళలకు అన్యాయం.. గాంధీ భవన్ ఎదుట మహిళా నేతల ఆందోళన