థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ… ప్రేక్షకులకు అవమానం… : నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో థియేటర్ల రేట్ల విషయమై రచ్చ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న టికెట్ రేట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోల్చుతున్నారు. ఒకరు ఇంతకుముందు భారీగా పెరిగిన టమాటో ధరతో పోలిస్తే, మరొకరు తెలంగాణాలో ఉన్న థియేటర్ పార్కింగ్ ఫీజుతో పోల్చారు. మరోవైపు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావించి, క్లోజ్ చేశారు కూడా. అక్కడ అఖండ, పుష్ప వంటి పెద్ద సినిమాలు విడుదలైనప్పటి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పడం లేదు. ఈ విషయంపై ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. కోర్టుకు వెళ్లినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై వెనక్కి తగ్గట్లేదు. తాజాగా టాలీవుడ్ నుంచి మరో హీరో వేసిన సెటైర్ సంచలనంగా మారింది.
Read Also :
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
తాజాగా నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 24న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఏపీ టికెట్ రేట్ల విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాని మీడియాతో మాట్లాడుతూ “ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు… మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు… ఈ పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్టే… ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని… మళ్ళీ ఇది అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో… రేపు అసలు సినిమా రిలీజ్ కూడా ఉంది… 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు… నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం… ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు… నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు… నువ్వు రూ. 0 ఇస్తే చాలు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే…” అంటూ చెప్పుకు రావడం సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!