Nani : నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. ఇప్పటి వరకు నాని ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఓ సెన్సేషన్ అయింది. ఇండస్ట్రీ చూపుతో పాటు ఇంటర్నెట్ చూపు మొత్తం ఈ సినిమావైపే వెళ్లిపోయింది. పైగా ఇందులో నాని పాత్రను లం… కొడుకు అంటూ చూపించడం పెద్ద చర్చకు దారి తీసింది. క్లాసిక్ సినిమాలు చేసే నాని ఇలాంటి సినిమా చేయడమే అందరికీ ఆశ్చర్యంగా మారింది. పైగా ఇందులో ఆయన రెండు జడలు, ముక్కు పుల్ల, చెవి కమ్మలు పెట్టుకుని మెడలో ఏవో దండలు వేసుకుని కనిపించాడు. చేతి మీద లం…. కొడుకు అనే టాటూ కూడా ఉంది.
read also : IPL 2025: పెద్ద ప్లానే.. 13 వేదికల్లో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్న బీసీసీఐ
దీంతో అసలు ఈ కథ ఏంటి.. ఇందులో నాని పాత్ర ఏంటి అని ఒకటే ఆరా తీస్తున్నారు. రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. కొందరేమో బిర్యానీ కథ అని.. ఇంకొందరేమో ఇది కాకుల కథ ఏమో అంటూ చెప్పేస్తున్నారు. అయితే ఇందులో అసలు కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని ఒక ట్రైబల్ జాతి నాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ కథ 1980వ ప్రాంతంలో జరుగుతుదంట. అప్పట్లో సికింద్రాబాద్ ప్రాంతంలో వెనకబడ్డ ఒక ట్రైబల్ జాతి కథనే ది ప్యారడైజ్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ జాతి అణచివేతకు గురైన టైమ్ లో హక్కుల కోసం పోరాడే తెగ నాయకుడి పాత్రలో నాని పవర్ ఫుల్ గా కనిపించబోతున్నారంట. ఈ సినిమాలో ఓ ఫైట్ లో ఆయన గే పాత్రలో కూడా కనిపించబోతున్నాడంట. తనలోని నటుడిని నిరూపించుకునేందుకు ఇలాంటి పాత్రలో కూడా మెరిసినట్టు సమాచారం. ఇందులో నాని నట విశ్వరూపం కనిపిస్తుందని ఇప్పటికే మూవీ టీమ్ హైప్ పెంచుతోంది. 26 మార్చి 2026 లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.