‘శ్యామ్ సింగ రాయ్’ కోసం నాని ప్రయోగం… ఏకంగా 15 సార్లు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాని, ఆయన బృందం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో సిద్ధంగా ఉన్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘శ్యామ్ సింగ రాయ్’లో తన కోసం తన లుక్‌ని ఖరారు చేయడానికి ముందు 15 విభిన్న గెటప్‌లతో ప్రయోగాలు చేశాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం బెంగాలీ రచయితగా తన పాత్రలో ఆకర్షణీయంగా కనిపించడం కోసం తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చానని నాని చెప్పాడు. రాహుల్ సంకృత్యాన్ ‘శ్యామ్ సింగ రాయ్’లో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సినిమాలో నాని పోషించే పాత్రలలో ఒకదాన్ని ఎంచుకోవడానికి ముందు చాలా గెటప్‌లను ప్రయత్నించచామని చెప్పుకొచ్చాడు.
మీడియాతో జరిగిన వీడియో సంభాషణలో నాని ఈ చిత్రంలో సామాజిక సంస్కర్త, విప్లవ రచయితగా తన పాత్రను క్లుప్తంగా మార్చాలని కోరినట్లు పేర్కొన్నాడు. “లుక్ ఇంటెన్స్‌గా కనిపించనప్పటికీ, మేక్ఓవర్ కొంచెం కష్టమైంది. “శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ప్రస్తుత లుక్‌ని ఫిక్స్ చేసుకునే ముందు దాదాపు 15 గెటప్‌లు ట్రై చేశాను” అంటూ నాని ఆసక్తికరమైన విషయాన్నీ రివీల్ చేశాడు. నాని మేకోవర్ గురించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ‘శ్యామ్ సింగ రాయ్’గా కొంచెం బొద్దుగా కనిపించినప్పటికీ ఆయన బరువు పెరగలేదు. నాని లుక్స్ ఆయన హెయిర్ స్టైల్, మీసాలు మరియు డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం మార్చారు. ఇది 70లలో బెంగాల్‌లోని అబ్బాయిల స్టైల్ ను కనబరుస్తుంది. బెంగాలీలో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాల్సిన నాని ఆ డిక్షన్ కూడా ప్రాక్టీస్ చేశాడట.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!