గత యేడాది దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ‘దసరా’కు సంబంధించిన ప్రకటనతో పాటు ఓ గ్లింప్స్ విడుదలైంది. నేచురల్ స్టార్ నాని సరసన జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న మాస్ ఎంటర్ టైనర్ ‘దసరా’లో నాని గతంలో ఎన్నడూ చూడని ఓ సరికొత్త గెటప్ తో కనిపించబోతున్నాడు.
మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సముద్రఖని, సాయి కుమార్, జరినా పోషించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకులు సుకుమార్, కిశోర్ తిరుమల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
