Nani: నాని ముందు రెండు ఆప్షన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 5న దేవర సినిమా వస్తుంది అని నందమూరి అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు కానీ ఎలక్షన్స్ కారణంగా దేవర వాయిదా పడుతుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ దేవర సినిమా దాదాపుగా పోస్ట్‌పోన్ అయినట్టేనని అంటున్నారు. అందుకే… ఆ రోజు విజయ్ దేవర కొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ అవుతోందని చెబుతున్నారు. అయితే… దేవర రూట్లోనే ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 కూడా వాయిదా పడుతుందని గట్టిగా ప్రచారం జరిగింది. అంతేకాదు… పుష్పరాజ్ ప్లేస్‌లో దేవర వస్తున్నాడని వినిపించింది కానీ మైత్రీ మూవీ మేకర్స్ వారు క్లియర్ కట్‌గా చెప్పేసారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇస్తునే ఉన్నారు. అయినా కూడా పుష్ప2 వాయిదా అంటూ రూమర్స్ ఆగడం లేదు.
ఎందుకంటే… బాలీవుడ్లో ఇదే డేట్‌కి అజయ్ దేవగన్ నటించిన సింగం సినిమా రిలీజ్ అవుతోంది. సింగం-పుష్ప 2 క్లాష్ పడితే పుష్పకి నార్త్‌లో థియేటర్స్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ పాయింట్‌ని కన్సిడర్ చేసి… ఒకవేళ పుష్ప2 వెనక్కి వెళ్తే మాత్రం ఆ డేట్‌కి దేవర కాకుండా… నాని వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా రిలీజ్ డేట్‌ను ఆగస్టు 15కి లాక్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. లేదు పుష్పరాజ్ అనుకున్న సమయానికే వస్తే మాత్రం… ఆగష్టు 29న సరిపోదా శనివారం రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి సరిపోదా శనివారం మేకర్స్ ఈ రెండు డేట్స్‌ను ఆప్షన్‌గా పెట్టుకొని… ఏదో ఒకటి ఫైనల్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
- Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
తాజావార్తలు
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్‌తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!