Nani: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన.. ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతుంది. ఇక హీరోలు కూడా ఈ ఎలక్షన్స్ మీదనే కన్నువేశారు. ఎలక్షన్స్ ను కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. అంత డిఫరెంట్ గా ఎలక్షన్స్ కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసిన హీరో ఎవరబ్బా అనుకుంటున్నారా.. ? ఇంకెవరు న్యాచురల్ స్టార్ నాని. ఈ హీరో నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని, మృణాల్.. దేన్నీ వదలకుండా సినిమా గురించి హైప్ ఇచ్చేస్తున్నారు.
The Village : ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది విలేజ్ ‘ ట్రైలర్..
సోషల్ మీడియా, యూట్యూబ్, ప్రెస్ మీట్స్, చివరికి ఎలక్షన్స్ కూడా వదలలేదు. తాజాగా నాని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడా.. ? అనేంతగా నాని.. హాయ్ నాన్న ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా నాని తన ట్విట్టర్ లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభిమానులను కోరాడు. రాజకీయ నాయకుడిలా రెడీ అయ్యి.. ప్రచారానికి వెళ్ళినప్పుడు దండం పెట్టి అడిగినట్లు.. ” అంతా ఎన్నికల వాతావరణం కాబట్టి. నేను కూడా ఎందుకు అందులో చేరకూడదు.. డిసెంబర్ 7 న మీ ప్రేమ మరియు ఓటు మాకే వెయ్యాలని.. మీ హయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ విరాజ్.. కొన్ని సరదా ప్రచార కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Since it’s all elections mood around. Why not join the madness 🙂
December 7th మీ ప్రేమ మరియు vote మాకే అవ్వాలని 😉
Mee #HiNanna party president
Viraj 🤗
( few fun campaigning specials will follow ) pic.twitter.com/QdtR6YKmDa— Nani (@NameisNani) November 17, 2023