The Village : ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ది విలేజ్ ‘ ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సౌత్ ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య. ఆర్య నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధించాయి. అయితే ఆర్య ఓ కొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ ‘ది విలేజ్’. ఈ వెబ్ సిరీస్ కు మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరిస్ నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.. ఇక ట్రైలర్ గమనిస్తే.. తన ఫ్యామిలీతో కలిసి ఆర్య ఒక భయంకరమైన గ్రామంలో చిక్కుకుంటాడు. అయితే అక్కడున్న వింత మనుషుల నుంచి తన ఫ్యామిలీని రక్షించుకునేందుకు ఆర్య ఏవిధంగా సాహసాలు చేస్తాడు అనేది సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ గ్రాఫిక్ నవల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ సిరీస్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో నవంబరు 24న స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆర్య సరసన దివ్య పిళ్లై హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే ఈ వెబ్ సిరీస్ లో ఆడుకాలం నరేన్, ఆజియా, తలైవాసల్ విజయ్, ముత్తు కుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, జయ ప్రకాష్ మరియు పిఎన్ సన్నీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో శక్తి ప్రొడక్షన్ బ్యానర్‌పై గౌరవ్ శ్రీవాస్తవ్ మరియు ప్రసాద్ పట్నాయక్ నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఆర్య తెలుగులో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ సినిమా లో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Tags
- #the village
- Arya
- release
- trailer
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!