న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషనల్ జోరు పెంచేసిన చిత్రబృందం.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరగుతుంది. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు.
ఇక తాజాగా ఈ వేడుక వద్దకు అభిమానుల కోలాహలం మధ్య నాని, నజ్రియా కలిసి వచ్చారు. నాని గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. గ్రీన్ కలర్ షర్ట్, బియర్డ్ లుక్ లో అదరగొట్టేశాడు. ఇక నాజ్రియా ఎల్లో కలర్ శారీలో అచ్చ తెలుగు ఆడపడుచును గుర్తుచేస్తుంది. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ మారాయి. ఇక ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుడు సుందర్ గా కనిపిస్తుండగా.. నజ్రియా లీలా థామస్ అనే క్రిస్టియన్ యువతి గా కనిపిస్తుంది.