NTV Telugu Site icon

Re-release Trend: నాని సమంతల రొమాంటిక్ మూవీ.. రీ రిలీజ్ ఎప్పుడు అంటే..?

Nani2

Nani2

Nani’s Yeto vellipoyindi manasu Re-release: నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని అలరించారు. తదుపరి చిత్రం సరిపోదా శనివారంలో కనిపించనున్నారు. ఆగష్టు 29న రిలీజ్ కాబోతున్నఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. అది ఏమిటి అంటే డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం “ఎటో వెళ్ళిపోయింది మనసు” రీరిలీజ్ కాబోతుంది. నాని హీరోగా,, సమంత హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా అందించారు. తమిళంలో “నీదానే ఎన్ పొన్వసంతం’ గా ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపొందింది. అందులో తమిళ నటుడు జీవా నాని నటించిన వరుణ్ పాత్రను పొషించగా, నిత్య పాత్రను సమంత పొషించింది. ఇక లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

Nani’s Yeto Vellipoyindhi Manasu To Re-release On This Date

Also Read: Nani New Look: మళ్ళీ మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించనున్న నాని

ఈ మూవీ లోని నాని , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే వీరిద్దరి మధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ కి కూడా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి ఈ సినిమాను ఆగస్టు 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. మరి ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఆగస్టు 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.