NTV Telugu Site icon

Nandamuri Fans: ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’ చేసారు… ఇదెక్కడి అరాచకం మావా

Jai Balayya

Jai Balayya

ఒకప్పుడు ‘జై బాలయ్య’ అనేది నందమూరి అభిమానులు సరదాగా చెప్పుకునే మాట. ఇప్పుడు ‘జై బాలయ్య’ అనేది సెలబ్రేషన్స్ కే స్లోగన్ లా మారిపోయింది. ఏ హీరో ఫంక్షన్ జరిగినా, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా, ఎక్కడ పది మంది కలిసి కూర్చున్నా, ఏదైనా పబ్ కి వెళ్లినా తప్పకుండా వినిపించే ఒకేఒక్క స్లోగన్… ‘జై బాలయ్య’. ఇలాంటి సీన్ ఒకటి డల్లాస్ లో జరిగింది. ‘డల్లాస్’ని ‘డల్లాస్ పురం’గా మారుతూ నందమూరి ఫాన్స్ రచ్చ రచ్చ చేసారు. క్రిస్మస్ హాలిడేస్ స్టార్ట్ అవ్వడంతో, డల్లాస్ లోని కొందరు తెలుగు వాళ్లు ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. తెలుగోడు ఎంజాయ్ చెయ్యాలి అంటే జై బాలయ్య నినాదం ఉండాల్సిందే కదా. డల్లాస్ రెస్టారెంట్ లో జరిగింది కూడా ఇదే.  ఆ రెస్టారెంట్ లో ఉన్న Djలో బాలయ్య నటించిన ‘అఖండ’ మూవీ ‘జై బాలయ్య’ సాంగ్ ని పెట్టుకోని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.

బాలయ్య ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. తెలుగోడు ఎక్కడ ఉన్నా తెలుగోడే, బాలయ్య ఫాన్స్ మాస్ సెలబ్రేషన్స్ అంటే ఏంటో చూపించారు, డల్లాస్ ని డల్లాస్ పురంగా మార్చేశారు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డల్లాస్ ని బాలయ్యకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘డల్లాస్ బాలయ్య యువసేన’ అనే అసోషియేషన్ ని నందమూరి అభిమానులు రన్ చేస్తున్నారు. బాలయ్య నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా కార్లు, జీపులతో ర్యాలీగా వెళ్లి సినిమా చూసి వస్తారు. అఖండ సినిమా రిలీజ్ సమయంలో అయితే డల్లాస్ బాలయ్య ఫాన్స్, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హంగామా జరుగుతుందో అంతకన్నా ఎక్కువే చేసారు. మరి ఈసారి సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాని ఏ రేంజులో సెలబ్రేట్ చేస్తారో చూడాలి.

Show comments