Site icon NTV Telugu

Nandamuri Family: అన్నగారి కుటుంబం.. అసలైనవాడు కూడా ఉంటే.. ?

Bala

Bala

Nandamuri Family: నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఇంకెన్నో. ఎన్టీఆర్ మనమధ్య లేకపోయినా.. ఆయన సాధించిన ఘనత, కీర్తి.. తెలుగువాడు ఉన్నంతవరకు ఉంటుంది. ఇక ఎన్టీఆర్ లెగసీని నందమూరి కుటుంబం ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఈ ఏడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నందమూరి కుటుంబం ఘనంగా జరిపిన విషయం తెల్సిందే. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ పై గౌరవంతో.. ఎన్టీఆర్‌ స్మారక రూ.100 నాణెంను విడుదల చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇక నేడు.. ఎన్టీఆర్‌ స్మారక రూ.100 నాణెంను రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబంతో పాటు.. రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Sudigali Sudheer: మళ్ళీ జబర్దస్త్ లోకి సుడిగాలి సుధీర్.. గుడ్ న్యూస్ చేప్పేశాడు

మొట్ట మొదటిసారి ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబం మొత్తం పాల్గొంది. సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కుమార్తెలు.. అల్లుళ్లు , కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా నందమూరి కుటుంబం మొత్తం ఒక్క ఫ్రేమ్ లో కనిపించారు. అయితే ఒకటే ఒక్క లోటు కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అదే .. ఫోటోలో నందమూరి బ్రదర్స్ లేకపోవడం. నందమూరి హరికృష్ణ ఇద్దరు కొడుకులు.. తారక్, కళ్యాణ్ రామ్.. ఇద్దరు ఈ ఫ్రేమ్ లో మిస్ అయ్యారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని కాపాడడంలో తారక్ తనదైన రీతిలో కష్టపడుతున్నాడు. కానీ, ఇలా తాతగారికి ఇంత అరుదైన గౌరవం దక్కుతున్న సందర్భంలో ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దేవర షూటింగ్ కారణంగా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఏదిఏమైనా ఈ ఫోటో చూసిన అభిమానులు .. అన్నగారి కుటుంబం బావుంది.. అసలైన వాడు కూడా ఉంటే ఇంకా బావుండేది అని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version