NTV Telugu Site icon

Gopichand 30: భోగి రోజున బాలయ్య వదిలిన ‘రామబాణం’

Gopichand 30

Gopichand 30

ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2లో బాలయ్య చేస్తున్న సందడి మరింత పెరిగింది. సీజన్ 1 కన్నా ఎక్కువ జోష్ తో సాగుతున్న ఈ సీజన్ 2కి ఇటివలే ప్రభాస్, గోపీచంద్ లు గెస్టులుగా వచ్చారు. ‘ఆహా’ క్రాష్ అయ్యే రేంజులో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన ఈ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2లో బాలయ్య, గోపీచంద్ నటిస్తున్న నెక్స్ట్ కి టైటిల్ ని ఫిక్స్ చేశాడు. గోపీచంద్ కి ఉన్న సెంటిమెంట్ ని బేస్ చేసుకోని టైటిల్ పెట్టాను, ఇక నుంచి నువ్వు ‘అన్ స్టాపబుల్’గా ఉండాలి అందుకే నీ సినిమా పేరు ‘రామబాణం’ అంటూ బాలయ్య అనౌన్స్ చేశాడు. ఈ సమయంలో గోపీచంద్ పక్కనే ఉన్న ప్రభాస్ “మీరు ముహూర్తం పెడితే సినిమా సూపర్ హిట్ సర్. రామబాణం టైటిల్ బాగుంది” అన్నాడు. భోగి రోజున ఈ టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.

Read Also: Unstoppable 2: బాలయ్యతో ప్రభాస్ ‘రాణి’ ఎవరో గోపీచంద్ చెప్పాడా!?

God Of Masses #NBK Garu unveiled #Gopichand30 Title in the Presence of Darling Prabhas‘ అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పోస్ట్ చేసింది. గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీని ‘శ్రీవాస్’ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకూ శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. రెండూ సూపర్ హిట్స్ అవ్వడమే కాకుండా గోపీచంద్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గర చేశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమానే ‘రామబాణం’. బాలయ్య మంచి ముహూర్తంలో పెట్టిన టైటిల్, పక్కనే ఉన్న ప్రభాస్ సపోర్ట్, శ్రీవాస్-గోపీచంద్ ల హిట్ ట్రాక్… అన్ని కలిసి రామాబాణం సినిమాని అనౌన్స్మెంట్ తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేలా చేసింది.

Show comments