NBK 108: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్… ఊరమాస్ కాంబో ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. హిస్టరీ రిపీట్ చెయ్యడానికి 2023 దసరాకే మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రెడీ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. బాలయ్య తెలంగాణా యాసలో మాస్ చూపించబోతున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా మరో స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. జైలు సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ తో మొదలైన NBK 108పై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ మాస్… రెండు ఎలిమెంట్స్ ఉండేలా రూపొందుతున్న NBK 108 సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
ఇటివలే గ్రాండ్ సెట్ లో, హై ఎనర్జీ సాంగ్ ని షూట్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా NBK 108లో బాలయ్యకి విలన్ గా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ని రంగంలోకి దించారు. NBK 108 కాస్ట్ లిస్టులోకి అర్జున్ రాంపాల్ వచ్చిన విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. డాన్, ఓం శాంతి ఓం, రాజనీతి, D-డే, సత్యాగ్రహ లాంటి సినిమాల్లో అర్జున్ రాంపాల్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పటివరకూ బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయిన అర్జున్ రాంపాల్, NBK 108 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి అర్జున్ రాంపాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. వెల్ బిల్ట్ బాడీతో అర్జున్ రాంపాల్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో బాలయ్య వార్ కి దిగితే తెరపై రెండు టిప్పర్ లారీలు గుద్దుకున్నట్లు ఉంటాయి. అర్జున్ రాంపాల్ రావడం NBK 108కి బిగ్గెస్ట్ ఎస్సెట్ అనే చెప్పాలి. మరి బాలయ్య vs అర్జున్ రాంపాల్ ఆన్ స్క్రీన్ వార్ ఎలా ఉండబోతుంది? అనీల్ రావిపూడి ఈ హీరో-విలన్ ట్రాక్ ని ఎలా డిజైన్ చేశాడు అనేది చూడాలి అంటే దసరా వరకూ ఆగాల్సిందే.
Also Read
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
- Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
- Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
Team #NBK108 welcomes the talented National Award winning actor @rampalarjun on board as the antagonist in his Telugu debut ❤️🔥❤️🔥
NataSimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi… pic.twitter.com/3Lqvy7XD9r
— Shine Screens (@Shine_Screens) May 10, 2023
తాజావార్తలు
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!