NTV Telugu Site icon

Balakrishna: నా సినిమాల జోలికి వస్తే వేరేలా ఉంటుంది… బాలయ్య మాస్ వార్నింగ్

Balakrishna

Balakrishna

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ కి మాస్ వార్నింగ్స్ ఇవ్వడంలో చాలా స్పెషల్. థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో డైలాగులు చెప్పే బాలయ్య, అప్పుడప్పుడూ బయట కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు. తనని కానీ, తెలుగు దేశం పార్టీని కానీ, తన సినిమాలని కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే సీరియస్ గా రెస్పాండ్ అయ్యే బాలకృష్ణ… తాజాగా ఒక ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చాడు. గుంటూరు నరసరావుపేటలో ఒక చోట కొంతమంది అభిమానులు బాలయ్య పాటలు పెట్టుకోని ఎంజాయ్ చేస్తుంటే, ఆ పాటలని ఆపెయ్యమని ఒక ఎమ్మెల్యే స్వయంగా చెప్పి మరీ ఆపించేసాడట. ఈ విషయం బాలయ్య దాకా రావడంతో “నా పాటలు పెడితే ఓ ఎమ్మెల్యే తీపించేసాడు. నాతో పెట్టుకోకు. నేను మూడో కన్ను తెరిస్తే ఏం అవుద్దో తెలుసుకో, రాజకీయాలు రాజకీయంగా చేద్దాం. నా సినిమాలు జోలికి వస్తే వ్యవహారం వేరేగా ఉంటది” అంటూ సినిమాటిక్ వార్నింగ్ ఇచ్చాడు.

తెనాలిలో జరిగిన ‘ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర అవార్డు’ ప్రదానోత్సవానికి విచ్చేసిన బాలకృష్ణ, ‘ఎన్టీఆర్ అవార్డు’ గ్రహీతలు స్వర్గీయ నటీమణి సావిత్రి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరి, సీనియర్ సినీ నటులు స్వర్గీయ నాగిరెడ్డి కుమారుడు డి.విశ్వనాథ రెడ్డి కి పురస్కారాలు అందించాడు. ఆ తర్వాత బాలయ్య… “ఏ రంగం లో అడుగు పెట్టిన దాని అంతు చూడటం నాకు అలవాటు. నేను నా అభిమానులు ఒక తల్లి కడుపున పుట్టక పోయిన మాది ఒకటే కుటుంబం. తెలుగు సినిమా మీసం మెలేసి రోషం చూపించిన సినిమా పాతాళ భైరవి. పాతాళ భైరవి ఒక పాన్ ఇండియా మూవీ. ఎన్టీఆర్ ఏ కులానికో ఏ పార్టీ కో చెందిన వ్యక్తో కాదు, పేదల మనిషి, కళాకారుల పక్షపాతి. ఎన్టీఆర్ చేసిన సంస్కరణలు చారిత్రాత్మకం, పేదవాడికి రెండు రూపాయల బియ్యం ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ పురస్కారాల వేడుకలు తెనాలి ఖ్యాతి నీ ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లాయి. మహానటి సావిత్రి కుమార్తె కు, ఎన్టీఆర్ పురస్కారం అందించడం సంతోషం. ఆంధ్ర ప్యారిస్ తెనాలి కళలకు కాణాచిగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ నుండి, ఈ తరం నటుల వరకు అనేక మంది రంగస్థల నటులు తెనాలి నుండి సినీ పరిశ్రమ లో వెలుగులు నింపారు” అని మాట్లాడాడు.

Read Also: Sameer Khakhar : ‘నక్కడ్’ సమీర్ ఖాఖర్ ఇక లేరు…