‘నుక్కడ్’లో టీవీ షోలో ‘ఖోప్రీ’ పాత్ర పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ‘సమీర్ ఖాఖర్’ ఈరోజు (మార్చి 15) కన్నుమూశారు. 71 ఏళ్ల వయసున్న సమీర్, తన 38 సంవత్సరాల జీవితాన్ని నటనే అంకితం ఇచ్చాడు. వివిధ టీవీ షోలు మరియు చిత్రాలలో నటించిన సమీర్ ఖాఖర్, గత కొంత కాలంగా ఎలాంటి షోస్ చెయ్యకుండా విరామం తీసుకోని USA లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాతో మళ్లీ యాక్టింగ్ కెరీర్ ని మొదలు పెట్టిన సమీర్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో మరణించారు. సమీర్ బంధువు గణేష్ ఖాఖర్, ‘సమీర్ ఖాఖర్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్లు వెల్లడించాడు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న సమీర్ ఈ ఉదయం 4:30 గంటలకు తుది శ్వాస విడిచాడు.
సమీర్ అంత్యక్రియలు ఈరోజు ఉదయం 10:30 గంటలకు బోరివలిలోని బాబాయ్ నాకా శ్మశానవాటికలో ముగిసాయి. నుక్కడ్, మనోరాజన్, సర్కస్, నయా నుక్కడ్, శ్రీమాన్ శ్రీమతి మరియు అదాలత్, సంజీవని లాంటి షోస్ లో నటించి నార్త్ ప్రేక్షకులకి దగ్గరైన సమీర్ ఖాన్ ఇటివలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “నాకు తెలిసిన వ్యక్తులు నాకు పని ఇస్తారని నేను ఆశిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు పని చేయాలనుకుంటున్నాను. నేను నా జీవితమంతా ప్రజలను అలరించాలనుకుంటున్నాను, నేను ఇంకా అలసిపోలేదు” అంటూ మాట్లాడారు. రీఎంట్రీ తర్వాత కెరీర్ పై ఎంతో హాప్ పెట్టుకున్నా సమీర్ ఖాఖర్ మరణించడం నార్త్ ప్రేక్షకులకి తీరని లోటనే చెప్పాలి. తను ఐకానిక్ పాత్రల ద్వారా సమీర్ ఖాఖర్ ఒక మంచి నటుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.