NTV Telugu Site icon

NBK109: అఫీషియల్.. ఆ బ్లాక్‌బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ

Nbk109 Announcement

Nbk109 Announcement

Nandamuri Balakrishna Join Hands With Bobby Kolli For His NBK109: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా టీజర్‌ని నేడు (10-06-23) విడుదల చేయడం జరిగింది కూడా! ఈ టీజర్‌తోనే ఫ్యాన్స్ అందరూ సంబరాలు జరుపుకుంటుండగా.. వారి ఆనందాన్ని రెట్టింపు చేసే మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బాలయ్య తదుపరి సినిమాపై ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన యువ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో బాలయ్య తన తదుపరి సినిమా చేస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కాబట్టి.. ‘NBK109’ను వర్కింగ్ టైటిల్‌గా కొనసాగిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకొని.. ఈ NBK109 సినిమాను అనౌన్స్ చేశారు.

Giriraj Singh: గాడ్సే ఈ దేశ పుత్రుడు.. ఔరంగజేబులా ఆక్రమణదారు కాదు.. ఓవైసీకి కేంద్రమంత్రి కౌంటర్

ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీకార స్టూడియోస్ వారు సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో నటించనున్న ప్రధాన పాత్రధారుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా గురించి ట్వీట్ చేసిన మేకర్స్.. ‘వయోలెన్స్ విజిటింగ్ కార్డ్’ అంటూ రాసుకొచ్చిన క్యాప్షన్ చూస్తుంటే, ఇది ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్‌లో రూపొందుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఆ పోస్టర్‌లో ఒక సూట్‌కేసు ఉండగా.. అందులో రకరకాల ఆయుధాలు, ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక మందు బాటిల్ ఉన్నాయి. బహుశా బాలయ్య ఇందులో కాంట్రాక్ట్ కిల్లర్‌గా కనిపించనున్నారేమో? లేకపోతే తన శతృవుపై రివేంజ్ తీర్చుకోవడం కోసం, ఇలా తన ప్లాన్‌లో భాగంగా ఈ సూట్‌కేసుని సిద్ధం చేసుకున్నారేమో? ఏదేమైనా.. ఈ సినిమాలో వయోలెన్స్ మాత్రం పీక్స్‌లో ఉండనున్నట్టు ఈ ఒక్క పోస్టర్‌తోనే హింట్ ఇచ్చేశారు.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్యల నిశ్చితార్థ వేడుకలో మెగా ఫ్యామిలీ

ఇదే సమయంలో.. మేకర్స్ తమ ట్వీట్‌లో మరో క్యాప్షన్ కూడా జోడించారు. ‘‘ప్రపంచానికి ఆయన గురించి తెలుసు కానీ, ఆయన ప్రపంచం ఏంటో ఎవ్వరికీ తెలీదు’’ అనే క్యాప్షన్ పెట్టారు. హీరోలను వీరోచితంగా చూపించడంలో బాబీ కొల్లి దిట్ట కాబట్టి, ఈ సినిమాలో అతడు బాలయ్యను ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాని తాము వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చారు కానీ, ఏ రోజున అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఓవైపు భగవంత్ కేసరి టీజర్‌తో పాటు ఈ కొత్త సినిమా అప్డేట్ రావడంతో.. సోషల్ మీడియాలో బాలయ్య పేరు మార్మోగిపోతోంది.