నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అతిత్వరలోనే ఈ సినిమా పాటల షూటింగ్ ముగియనుండగా.. దసరాకు థియేటర్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి దసరా పండగ వసూళ్లను క్యాష్ చేసుకొందుకు ఏ స్టార్ హీరో సినిమా కూడా లేదు. దీంతో ఎలాగైనా బాలయ్య సినిమాను దసరాకి తీసుకురావాలని అనుకుంటున్నారట. ఇప్పటికే విడుదల పోస్టర్స్, టీజర్ కు మంచి స్పందన లభించింది. రీసెంట్ గా వచ్చిన ‘అడిగా అడిగా’ సాంగ్ కూడా అభిమానులను ఆకట్టుకొంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
దసరా వసూళ్ళపై కన్నేసిన బాలయ్య ‘అఖండ’!
