Nana Patekar: కావాలని కొట్టి.. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కబుర్లు చెప్తున్నావా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nana Patekar: తమ అభిమాన హీరో కానీ, హీరోయిన్ కానీ కనిపిస్తే,.. ఏ ఫ్యాన్ అయినా ఫోటోలు కోసం ఎగబడతారు. అది కామన్. అభిమానులు అంటూ లేకపోతే ఈ హీరోలు, హీరోయిన్లు ఇంత పేరు తెచ్చుకొనేవారే కాదు. తమ కుటుంబానికి కన్నా.. అభిమాన హీరో కోసమే ఎంతోమంది యువత కష్టపడుతున్నారు. ఆలాంటి వారు ఎదురైనప్పుడు ఒక చిన్న ఫోటో ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు. ఇంకొంతమంది అయితే సెల్ఫీల కోసం వచ్చినవారిపై చెయ్యి చేసుకోవడం, బౌన్సర్లతో నెట్టివ్వడం లాంటివి చేస్తున్నారు. ఇక నిన్నటికి నిన్న బాలీవుడ్ స్టార్ నటుడు నానా పటేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్న విషయం తెల్సిందే. ఇక ఒక షూటింగ్ స్పాట్ లో నానా పటేకర్.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన ఒక అభిమాని తలపై గట్టిగా కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీంతో నెటిజన్స్ నానా పటేకర్ ను ఏకిపారేస్తున్నారు.
Sehar Shinwari: పాక్ నటిని ఏకిపారేస్తున్న ఇండియన్స్.. బాగా ఏడువు అంటూ కామెంట్స్
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ఇక దీంతో నానా పటేకర్ ఈ వీడియోపై స్పందించాడు. ఆ యువకుడును తాను కావాలని కొట్టలేదని, తమ క్రూలో వ్యక్తి అనుకోని.. షాట్ జరుగుతుండగా వచ్చాడని కోపంతో కొట్టినట్లు చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు. ” నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నేను కావాలని చేసింది కాదు. అది కూడా మా సీన్ లో భాగమే. ముందుగా ఈ సీన్ కోసం రిహార్సల్స్ చేశాం. మేము రెండవ రిహార్సల్ చేయడానికి షెడ్యూల్ చేశాం. దర్శకుడు స్టార్ట్ అనగానే.. వీడియోలోని అబ్బాయి లోపలికి వచ్చాడు. అప్పుడు కెమెరా ముందు మేము నటించేందకు సిద్ధంగా ఉన్న సమయంలో సడెన్ గా వచ్చాడని చెంపదెబ్బ కొట్టాను. సీన్ ప్రకారం అతన్ని వెళ్లిపొమ్మని కూడా అప్పుడు చెప్పాను. తర్వాత, అతను సిబ్బందిలో భాగం కాదని నాకు తెలిసింది. ఆ తరువాత అతడి కోసం నేను వెతికాను. అప్పటికే ఆటను అక్కడనుంచి వెళ్ళిపోయాడు. అతని ఫ్రెండ్ తీసిన వీడియోనే అనుకుంట వైరల్ గా మారింది. నేను ఇప్పటివరకు ఎవ్వరికీ నో చెప్పలేదు. నేను ఇలా చేసే వ్యక్తిని కాదు. పొరపాటున ఇలా జరిగింది. నేను అర్థం చేసుకోవడంలో తప్పు జరిగింది. ఈ వీడియో ద్వారా నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.కావాలని కొట్టి.. ఇప్పుడు కవర్ చేసుకోవడానికి కబుర్లు చెప్తున్నావా.. ? అని కొందరు.. తన పేరుకు మచ్చ రాకుండా చాలా జాగ్రత్తగా మాట మారుస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.
#WATCH | On a viral showing him slapping a boy for taking a selfie with him, actor Nana Patekar says, "A video is going viral where I have hit a boy. Though this sequence is a part of our film, we had one rehearsal…We were scheduled to have a second rehearsal. The director told… pic.twitter.com/CVgCainRg1
— ANI (@ANI) November 16, 2023
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..